డీఎంకేలోకి ఓపీఎస్
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:17 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ప్రత్యర్థులు మిత్రులయ్యారు. తమిళనాడు మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) అధికార పార్టీ...
కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న స్టాలిన్
చెన్నై, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ప్రత్యర్థులు మిత్రులయ్యారు. తమిళనాడు మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయారు. శుక్రవారం ఉదయం డీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఓపీఎస్.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా డీఎంకే సభ్యత్వం తీసుకున్నారు. ఓపీఎస్‌కు కండువా కప్పిన స్టాలిన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఓపీఎ్‌సతో పాటు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రనాథ్, ఓపీఎస్ అనుచరుడు, ఉసిలంపట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్ కూడా డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ