ఆపరేషన్ సిందూర్.. ‘సుదర్శన చక్రం’ కోసం పాక్ వెతుకులాట
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:48 PM
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జితేంద్ర సింగ్ తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జితేంద్ర సింగ్ తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుదర్శన చక్రం (ఎస్ -400 గగనతల రక్షణ వ్యవస్థ) దెబ్బకు పాక్ వణికిపోయిందని అన్నారు. దీని జాడ కనుక్కునేందుకు విఫలయత్నం చేసిందని చెప్పారు. భారత్‌లోని గూఢచార స్లీపర్ సెల్స్‌ను కూడా క్రియాశీలకం చేసిందని తెలిపారు. పాక్ విమానంలో గగనతంలో కనిపించగానే ఎస్-400తో దాడి చేసేవాళ్లమంటూ నాటి విషయాల గురించి చెప్పారు.
ఎస్-400తోనే పాక్‌కు అత్యంత ముప్పు
‘ఎస్-400 జాడను కనుక్కునేందుకు వాళ్లు రకరకాల ప్రయత్నాలు చేశారు. తమకు అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్నీ వినియోగించుకున్నారు. ఇతర దేశాల శాటిలైట్లతో మన ఎస్-400 జాడ కనుక్కునే ప్రయత్నం కూడా జరిగింది. వాళ్ల యుద్ధ విమానం గగనతంలోకి వచ్చిన ప్రతీసారి ఎస్-400కు బలైపోయింది. చివరకు వారు భారత్‌లోని గూఢచార స్లీపర్ సెల్స్‌ను క్రియాశీలకం చేసి ఎస్-400 జాడను కనుక్కునే ప్రయత్నం చేశారు’ అని చెప్పారు.
భారత దేశ గగనతల రక్షణ వ్యవస్థకు ఎస్-400 కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థను రష్యా రూపొందించింది. ఎస్-400 ద్వారా భూమ్మీద నుంచి ప్రయోగించే మిసైల్స్ శత్రుదేశ విహంగాలను గాల్లోనే ధ్వంసం చేస్తాయి. అత్యాధునిక రాడార్ సామర్థ్యం కారణంగా శత్రుదేశాల విహంగాలు సుదూరాన ఉండగానే గుర్తించి ధ్వంసం చేస్తాయి. 2018లో భారత్ రష్యాతో ఐదు ఎస్-400ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే భారత్‌కు డెలివరీ అయిన మూడింటిని ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశపెట్టారు. నాలుగోది ఈ ఏడాది జూన్‌కు భారత్‌కు చేరుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీకి లేఖ రాసిన విపక్ష నేత మల్లికార్జున ఖర్గే
ఈశా క్యాంపులో విషాద ఛాయలు.. సద్గురు కన్నీటిపర్యంతం