Share News

యుద్ధ స్మారకంపై ‘సిందూర్‌’ అమరుల పేర్లు

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:31 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వెల్లడించింది...

యుద్ధ స్మారకంపై ‘సిందూర్‌’ అమరుల పేర్లు

  • ఏపీకి చెందిన అగ్నివీర్‌ మురళీ నాయక్‌ పేరు కూడా

న్యూఢిల్లీ, జూన్‌ 26: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ ఆరుగురు అమరవీరుల పేర్లను ఢిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద 2025 విభాగంలో త్రీడీ గోడపై లిఖించారు. ఈ వీరుల త్యాగాలను స్మరిస్తూ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వెబ్‌సైట్‌లోని ‘రోల్‌ ఆఫ్‌ హానర్‌’ విభాగంలోనూ వీరి పేర్లను అధికారికంగా చేర్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత సాయుధ దళాలు చవిచూసిన ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. 2025 ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది పర్యాటకులను దారుణంగా చంపేశారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్‌ 2022 నవంబరులో అగ్నివీర్‌గా సైన్యంలో చేరారు.

అమర వీరుల వివరాలు ఇవే..

  • సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ (హెడ్‌క్వార్టర్స్‌ 10వ పదాతిదళ బ్రిగేడ్‌)

  • రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌ (వీరచక్ర) (జమ్ముకశ్మీర్‌ లైట్‌ పదాతిదళం)

  • లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌ (5వ ఫీల్డ్‌ రెజిమెంట్‌)

  • అగ్నివీర్‌ మురళీనాయక్‌ (851వ రెజిమెంట్‌) (శ్రీసత్యసాయి జిల్లా)

  • హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ (237వ షీల్డ్‌ వర్క్‌షాప్‌)

  • సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ (భారత వైమానిక దళం 39వ వింగ్‌.. మరణానంతరం వాయుసేన మెడల్‌)

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

Updated Date - Jun 27 , 2026 | 06:31 AM