Share News

ఒకప్పుడు గన్ను.. ఇప్పుడు పెన్ను!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:12 AM

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌ క్యాడర్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మావోయిస్టులు సమాజంలో ఆదర్శంగా నిలిచారు.

ఒకప్పుడు గన్ను.. ఇప్పుడు పెన్ను!
exmaoists

10వ తరగతి పాస్‌ అయిన మాజీ మావోయిస్టులు

రాయ్‌పూర్‌, అక్టోబరు 1: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌ క్యాడర్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మావోయిస్టులు సమాజంలో ఆదర్శంగా నిలిచారు. గతంలో అడవుల్లో గన్నులు పట్టిన వీరంతా.. ఇప్పుడు పెన్నులు పట్టారు! ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన పదో తరగతి రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో అందరూ మంచి మార్కులతో పాస్‌ అయి.. కొత్త భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. 36 ఏళ్ల గీతా నరోటే అలియాస్‌ డాక్టర్‌ చంపా గతంలో మావోయిస్టు సంస్థ మెడికల్‌ టీమ్‌లో ఉండేవారు. ఆమె కుటుంబ పరిస్థితుల కారణంగా ఆరో తరగతి తర్వాత చదు వు మానేసింది. ఇప్పుడు మళ్లీ చదువుకోవడం తనకు ఆనందంగా ఉందని, భవిష్యత్తులో నర్సు అయి ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గీత చెప్పారు. ఏరియా కమిటీ సభ్యుడిగా చేసిన కంకేర్‌ జిల్లాకు చెందిన మరో మాజీ మావోయిస్టు సంతోష్‌ అంచ్లా అలియాస్‌ సన్నూ రెండో తరగతిలోనే చదువు ఆపేశారు. ఇప్పుడు పదో తరగతి పాస్‌ అయిన ఆయన.. చదువు కొనసాగించి, భవిష్యత్తులో సొంతంగా వ్యాపారం, వ్యవసాయం చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. ఇక రాంధర్‌ కశ్య్‌పది కూడా సన్నూ కథే. మావోయిస్టు సంస్థలో తాను చదవడం, రాయడం నేర్చుకున్నానని.. ఇప్పుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 04:19 AM