Share News

ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్జన ప్రాంతానికి ఒమర్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:33 AM

జమ్ముకశ్మీర్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఒమర్‌ అబ్దుల్లా తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిర్జన(జీరో నెట్‌వర్క్‌)...

ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్జన ప్రాంతానికి ఒమర్‌

శ్రీనగర్‌, జూన్‌ 3: జమ్ముకశ్మీర్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఒమర్‌ అబ్దుల్లా తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిర్జన(జీరో నెట్‌వర్క్‌) ప్రాంతానికి తీసుకువెళ్లడం చర్చనీయాంశం అయింది. రాజధాని శ్రీనగర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న డచిగాం జాతీయ పార్కుకు వారిని ప్రత్యేక బస్సుల్లో స్వయంగా ఆయన తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే.. దీనిలో రాజకీయం ఏమీ లేదని, 19నెలల పాలనను సమీక్షించేందుకే డచిగాంను ఎంచుకున్నామని ఒమర్‌.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత ఒమర్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలవచ్చని విపక్ష బీజేపీ, పీడీపీలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఒమర్‌ నిర్వహించిన బలపరీక్షగా తాజాగా పర్యటనను బీజేపీ అభివర్ణించింది.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 05:33 AM