Share News

పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:51 PM

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. తిరిగి ఓటు నమోదుకు నిరభ్యంతరంగా 'ఫారం-6' సమర్పించవచ్చని స్పష్టం చేసింది.

పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్
Election Commission of India

ఇంటర్నెట్ డెస్క్: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. తిరిగి ఓటు నమోదుకు నిరభ్యంతరంగా 'ఫారం-6' సమర్పించవచ్చని స్పష్టం చేసింది. పాత ఓటర్లు మళ్లీ 'ఫారం-6' సమర్పిస్తే నేరం కాదని పేర్కొంది. ఫారం-6 లోని 'మొదటిసారి ఓటు' అనే డిక్లరేషన్‌పై పాత ఓటర్లు భయపడాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓటు ఉండి మళ్లీ ఫారం-6 వేస్తే తప్పుడు డిక్లరేషన్ కిందకు రాదని వివరించింది.


ఫారం-6 సమర్పించే పాత ఓటర్లపై ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈఆర్వోలకు (EROs) ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు ఓటరుకు మరో నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని మాత్రం షరతు విధించింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక భాషల్లో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని కూడా అన్ని రాష్ట్రాల సీఈవోలకు ఆదేశాలు.


ఫారం-6తో ఫాల్స్ డిక్లరేషన్ భయాలపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారు ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ స్వయంగా సూచించినప్పుడు ఆందోళన అవసరం లేదని పేర్కొంది. ఫారం-6కి బదులు ఫారం-8 ద్వారా దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనపై కోర్టు ఈ మేరకు స్పందించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం పూర్తి స్పష్టతను ఇచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

జమ్మూకశ్మీర్ సీఎంకు ఒమర్ అబ్దాల్లాకు షాక్.. ఎంపీ రాజీనామా

డిజిటల్ వాలెట్ పేరిట భారీ స్కామ్.. ఏకంగా 1,211 కోట్లు వసూలు

Updated Date - Nov 03 , 2026 | 07:51 PM