Share News

డిజిటల్ వాలెట్ పేరిట భారీ స్కామ్.. ఏకంగా 1,211 కోట్లు వసూలు

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:41 PM

గుజరాత్‌లో తాజాగా ఓ భారీ స్కామ్ బయటపడింది. ఎస్‌డీ పే డిజిటల్ వాలెట్ పేరిట నిందితులు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ మొదలుపెట్టి ఏకంగా రూ.1,211 కోట్లు వసూలు చేశారు. దేశవ్యాప్తంగా 6.52 లక్షల మంది ఈ స్కామ్ బారినపడ్డారు.

డిజిటల్ వాలెట్ పేరిట భారీ స్కామ్.. ఏకంగా 1,211 కోట్లు వసూలు
SD Pay Digital Wallet Scam

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో తాజాగా ఓ భారీ స్కామ్ బయటపడింది. ఎస్‌డీ పే డిజిటల్ వాలెట్ పేరిట నిందితులు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ మొదలుపెట్టి ఏకంగా రూ.1,211 కోట్లు వసూలు చేశారు. దేశవ్యాప్తంగా 6.52 లక్షల మంది ఈ స్కామ్ బారినపడ్డారు. వాలెట్‌లో డబ్బులు జమ చేస్తే 9 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపిన నిందితులు భారీ ఎత్తున డబ్బులు దండుకున్నారు. స్కామ్ బారినపడ్డ వారిలో దాదాపు 6 లక్షల మంది గుజరాత్‌లోనే ఉన్నారు.


వలపన్నింది ఇలా..

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎస్‌డీ యాప్‌లో పెట్టుబడి పెడితే భారీ వడ్డీ, కమిషన్లు ఇస్తామని నిందితులు ఆశ చూపారు. ఈ పథకంలో కొత్త వారిని చేర్పిస్తే అదనపు రివార్డులు ఇస్తామని ఆశపెట్టి మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కా్మ్‌కు తెరతీశారు. కొత్తగా స్కీమ్‌లో చేరే వారు ఇచ్చిన సొమ్ముతో పాత వారికి డబ్బు చెల్లించేవారు. అనేక మంది తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారితో ఎస్‌డీ యాప్‌లో పెట్టుబడి పెట్టించి చివరకు మోసం జరిగిందని తెలిసి గొల్లుమన్నారు. యాప్‌లో కనిపించిన సొమ్ము విత్‌డ్రా చేసుకోవడం కుదరకపోవడంతో చివరకు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు.


ఇలా తమకు తెలిసిన వారిని చేర్పించినందుకు ఓ మహిళ నెలకు రూ.25 వేల వరకూ కమిషన్లు పొందింది. దీంతో, అంతా సవ్యంగా సాగిపోతోందని ఆమె భ్రమపడింది. విషయం తెలిశాక నోరెళ్లబెట్టింది. ఈ ఏడాది మార్చి నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో స్కామ్ గురించి బయటపడింది. ఆ తరువాత దాదాపు 800 మంది ఫిర్యాదు చేయడంతో ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు స్కామ్ గురించి వెలికితీశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ధవళ్ పటేల్‌, నరేంద్ర సోలంకీ సహా మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోలంకీ గతంలో ఓ యూపీఐ ఆధారిత కంపెనీలో కూడా పని చేసినట్టు పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలనూ చదవండి:

రూ.21,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

ఢిల్లీ వ్యాపార సంఘాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 03 , 2026 | 05:53 PM