ఒడిశాలో విషాదం.. మొబైల్‌తో కొట్టిన భార్య.. భర్త మృతి
ABN , Publish Date - Jul 13 , 2026 | 01:10 PM
ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలో భార్యాభర్తల మధ్య వివాదం విషాదానికి దారితీసింది. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం భార్యాభర్తల మధ్య ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య కోపంతో మొబైల్ ఫోన్‌ను భర్త తలపై కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని వెంటనే జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించగా ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
అయితే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు మరోసారి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించినప్పటికీ అతను మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి గల అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read:
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
ముత్యం ధరిస్తే అదృష్టమా? ఏ రాశులకు శుభమో తెలుసుకోండి