ముత్యం ధరిస్తే అదృష్టమా? ఏ రాశులకు శుభమో తెలుసుకోండి
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:45 AM
జ్యోతిష్య శాస్త్రంలో ముత్యాన్ని చంద్రుడికి సంబంధించిన రత్నంగా భావిస్తారు. ఇది మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను పెంచుతుందని విశ్వసిస్తారు. అయితే, ముత్యం అందరికీ అనుకూలం కాదని, జాతకాన్ని పరిశీలించిన తర్వాతే ధరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రాచీన కాలం నుంచి రత్నాలు ధరించే సంప్రదాయం కొనసాగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రత్నాలు కేవలం అందం కోసం మాత్రమే కాదు, గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేసే పరిహారంగా కూడా భావిస్తారు. ముత్యం.. చంద్రుడికి సంబంధించిన రత్నంగా పరిగణిస్తారు. ఇది మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ముత్యం అందరికీ అనుకూలం కాదని, జాతకాన్ని పరిశీలించిన తర్వాతే ధరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ముత్యం ఏ గ్రహానికి సంబంధించిన రత్నం?
జ్యోతిష్య శాస్త్రంలో ముత్యాన్ని చంద్రుడి రత్నంగా పరిగణిస్తారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు లేదా మానసిక ఒత్తిడి, భావోద్వేగ అస్థిరత ఎక్కువగా ఉన్నవారికి ముత్యాన్ని ధరించాలని కొందరు జ్యోతిష్యులు సూచిస్తారు.
ఈ రాశుల వారికి ముత్యం శుభప్రదం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేషం, కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారికి ముత్యం ధరించడం అనుకూలంగా ఉంటుందని చెబుతారు. వీరు ముత్యం ధరిస్తే మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని విశ్వసిస్తారు.
ఈ రాశుల వారు జాగ్రత్త
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సింహం, తుల, ధనుస్సు రాశుల వారు ముత్యాన్ని అవసరమైతే మాత్రమే ధరించడం మంచిది. ముత్యం ధరించే ముందు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులతో జాతకాన్ని పరిశీలించుకుని, వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ 5 రాశుల వారు నిపుణుల సలహా తీసుకోవాలి
వృషభం, మిథునం, కన్య, మకరం, కుంభం రాశుల వారు జ్యోతిష్యుని సలహా లేకుండా ముత్యం ధరించకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వారి జాతకంలో శుక్రుడు, బుధుడు లేదా శని ప్రభావం బలంగా ఉంటే ముత్యం అనుకూలంగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జాతకం ఎందుకు చూడాలి?
ప్రతి వ్యక్తి జాతకంలో గ్రహస్థితులు, యోగాలు, దశలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఒకే రత్నం అందరికీ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఏ రత్నమైనా ధరించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యునితో జాతకాన్ని పరిశీలించించి, వారి సలహా మేరకు మాత్రమే ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఈ కథనం జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే అందించడం జరుగుతోంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!