జూనియర్ ఇంజనీర్ నుంచి కోట్లకు పడగలు!
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:39 AM
జూనియర్ ఇంజనీర్‌గా 1999లో రూ.6 వేల జీతానికి ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కోట్లకు పడగలెత్తిన అధికారి ఉదంతం ఒడిసాలో వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ సోదాల్లో...
ఒడిశాలో ఓ అధికారి ఇంట్లో రూ.కోట్ల నగదు, బంగారం స్వాధీనం
భువనేశ్వర్, జూన్ 7: జూనియర్ ఇంజనీర్‌గా 1999లో రూ.6 వేల జీతానికి ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కోట్లకు పడగలెత్తిన అధికారి ఉదంతం ఒడిసాలో వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ సోదాల్లో కోట్ల రూపాయల నగదు, అనేక లగ్జరీ ఆస్తులు, ఖరీదైన భూములు, ఆభరణాలను అధికారులు గుర్తించారు. వైకుంఠనాథ్ బెహరా ఒడిసాలోని కంథమాల్ జిల్లా బలిగుడలోని ఐటీడీఏలో ఏఈఈగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో భువనేశ్వర్, బాలాసోర్, జాజ్‌పూర్, బలిగుడ నగరాల్లోని తొమ్మిది చోట్ల శనివారం సోదాలు నిర్వహించారు. ఆయనకు రాజధాని భువనేశ్వర్ చుట్టుపక్కల 5 బహుళ అంతస్థుల భవనాలు, 13 ఖరీదైన ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో, బ్యాంకు లాకర్లలో ఉంచిన రూ.2.4 కోట్ల నగదు, 341 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ.45 లక్షలకుపైగా బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News