మాజీ ప్రియుడి అరాచకం.. పెళ్లైన గంటల్లోనే వధువు కిడ్నాప్..
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:40 PM
పెళ్లైన కొన్ని గంటల్లోనే కొత్త జంటకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కూతురు మాజీ ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. తుపాకితో బెదిరించి పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు..
భువనేశ్వర్, ఫిబ్రవరి 22: కొత్త జంటకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లైన కొన్ని గంటల్లోనే పెళ్లి కూతురు కిడ్నాప్‌నకు గురైంది. పెళ్లి కూతురు మాజీ ప్రియుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తుపాకితో బెదిరించి పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బోలన్‌గిర్ జిల్లాకు చెందిన హరిబంధు పాటెల్‌కు కంతమల్‌కు చెందిన యువతితో పెళ్లైంది. ఆదివారం ఉదయం పెళ్లి కాగా.. మధ్యాహ్నం పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులతో కలిసి కారులో బోలన్‌గిరి బయలుదేరారు. బదబంధ దగ్గర వీరి వాహనాన్ని పెళ్లి కూతురు మాజీ ప్రియుడు.. మరో ఇద్దరితో కలిసి ఆపాడు. తుపాకితో పెళ్లి కొడుకును బెదిరించి పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. దీంతో చివరకు పెళ్లి కొడుకు పోలీసులను ఆశ్రయించి, భార్య కిడ్నాప్‌పై ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఇన్‌స్పెక్టర్ అనిత కిదో మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత జంట వాహనంలో పెళ్లి కొడుకు ఇంటికి వస్తున్నారు. ఓ ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని ఆపారు. తుపాకితో వాహనంలోని వారిని బెదిరించి, పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితులను పట్టుకునే పనిలో ఉన్నాం. యువతిని క్షేమంగా తిరిగి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. ఇక, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి..
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
టీ20 ప్రపంచ కప్: 95 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. ఇంగ్లండ్ ఘన విజయం