Share News

కొండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. 8 గంటల నరకం తర్వాత..

ABN , Publish Date - May 07 , 2026 | 06:59 AM

తేనె కోసం కొండ రాళ్ల మధ్యలోకి దూరిన ఓ బాలుడి తల లోపల ఇరుక్కుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో బాలుడు 8 గంటల పాటు నరకం చూశాడు. ఈ సంఘటన ఒడిశాలో బుధవారం చోటుచేసుకుంది.

కొండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. 8 గంటల నరకం తర్వాత..
Odisha boy rescue

భువనేశ్వర్, మే 7: తేనె కోసం కొండ రాళ్ల మధ్యలోకి దూరిన ఓ బాలుడి తల లోపల ఇరుక్కుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో బాలుడు 8 గంటల పాటు నరకం చూశాడు. బాలుడికి కొద్ది దూరంలో పెద్ద పాము ఉండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రెస్క్యూ టీమ్ పుణ్యమా అని 8 గంటల తర్వాత ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఒడిశాలో బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నయాఘర్ జిల్లాకు చెందిన శిబ ప్రధాన్ అనే బాలుడు బంధువుతో కలిసి తేనె తీసుకురావడానికి కానిపద అడవిలోకి వెళ్లాడు.


తేనె కోసం వెతుకుతున్న వారికి ఓ చోట కొండ రాళ్ల మధ్య తేనెపట్టు కనిపించింది. బాలుడు దాన్ని తీయడానికి కొండ రాళ్ల మధ్యలోకి దూరాడు. అనుకోని విధంగా బాలుడి తల లోపల ఇరుక్కుపోయింది. పిల్లాడి బంధువు పిల్లాడిని బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఊరిలోకి వెళ్లి గ్రామస్తులను తీసుకువచ్చాడు. బాలుడిని బయటకు తీయటం వారి వల్ల కూడా కాలేదు. దీంతో పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.


వారు అక్కడికి వచ్చే సమయానికి బాలుడికి కొద్దిదూరంలో పెద్ద పాము ఉంది. పాము కారణంగా సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఫైర్ సిబ్బంది మొదట పామును పక్కకు తీసి.. తర్వాత బాలుడిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. దాదాపు 8 గంటల కష్టం తర్వాత బాలుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ ఘటనలో బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు.


ఇవి కూడా చదవండి

విజయ్‌కు హంగ్‌ భంగం?

డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి విచ్ఛిన్నం

Updated Date - May 07 , 2026 | 07:11 AM