నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Jul 15 , 2026 | 02:37 PM
నోయిడాలోని మామురా గ్రామంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
నోయిడా, జులై15: నోయిడాలోని మామురా గ్రామంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. 50 కుటుంబాలను రక్షించినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్‌లో చెలరేగిన నిప్పురవ్వలే ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ అగ్నిప్రమాదంపై తమకు సమాచారం అందిన వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలతోపాటు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని జాయింట్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ వెల్లడించారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం వల్ల భారీగా పొగ వ్యాపించడంతో.. ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన భవనంలో బేస్‌మెంట్‌లో కాకుండా.. గ్రౌండ్ ఫ్లోర్‌లో వాహనాల పార్కింగ్ ఉందని వివరించారు. ఆ ప్రాంతం నుంచి పొగ పైకి వ్యాపించి.. ఆ భవనంలో నివసిస్తున్న వారిపై ప్రభావం చూపిందని పోలీస్ జాయింట్ కమిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై దాఖలైన పిల్.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
For National News And Telugu News