Share News

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:42 PM

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా దేశంలో చమురు, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను భయపెట్టేలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..
gas cylinder booking 35 days

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా దేశంలో చమురు, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను భయపెట్టేలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్టు మంగళవారం వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది (LPG booking rule).


ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని కేంద్రం పెట్రోలియం శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవు. కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎప్పటిలాగానే కొనసాగుతుంది' అని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది (gas cylinder booking 35 days).


గ్యాస్ బుకింగ్ విషయంలో ఆందోళనలు వద్దని, అలాగే అవసరం లేకపోయినా బుకింగ్‌లు చేయవద్దని ప్రజలకు కేంద్రం సూచించింది (Gas refill update). రెండు సిలిండర్లు ఉంటే గ్యాస్ బుకింగ్ మధ్య అంతరాయాన్ని 35 రోజులకు పెంచినట్టు మంగళవారం నుంచి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వార్తలన్నీ అబద్ధాలని కేంద్రం ప్రకటనతో తాజాగా తేలింది.


ఇవి కూడా చదవండి..

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..


పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

Updated Date - Mar 25 , 2026 | 04:02 PM