Share News

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్‌ ప్రమాణం

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:20 AM

జేడియూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో పార్లమెంట్‌లోని...

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్‌ ప్రమాణం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: జేడియూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో ప్రమాణం చేయించారు. పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బిహార్‌ సీఎం పదవికి నితీశ్‌ ఈ నెల 14న రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. బిహార్‌ డిప్యూటీ సీఎం సమ్రాట్‌ చౌదరి కూడా ఢిల్లీలో ఉండటంతో అధికార మార్పిడిపై బీజేపీ-జేడీయూ అధిష్టానాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన సందర్భంగా నితీశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మాజీ సీజేఐ గొగోయ్‌ రిటైర్‌మెంట్‌తో ఖాళీ ఏర్పడటంతో రాష్ట్రపతి ముర్ము హరివంశ్‌ను నామినేట్‌ చేశారు.

ఈ వార్తలూ చదవండి:

200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

Updated Date - Apr 11 , 2026 | 06:20 AM