Share News

ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 08:39 PM

ఈ20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం సమర్థించుకున్నారు. కేంద్రం తెచ్చిన ఈ విధానంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు.

ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు
Nitin Gadkari

ఇంటర్నెట్ డెస్క్: ఈ20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం సమర్థించుకున్నారు. కేంద్రం తెచ్చిన ఈ విధానంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ20 పెట్రోల్‌ విధానంతో తన వ్యక్తిగత ప్రయోజనాలు ఏవీ ముడిపడిలేవని స్పష్టం చేశారు. తనకొచ్చే లాభం ఏదీ లేదని అన్నారు. ఈ ఇంధనంతో వాహనాలు దెబ్బతిన్నట్టు ఒక్క ఆధారమైనా చూపించాలని విమర్శకులకు సవాలు విసిరారు. ఇంధన దిగుమతులు తగ్గించి, పర్యావరణహిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు ఈ20 పెట్రోల్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఈ విధానంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు.


ఇథనాల్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంతో తనకు వ్యక్తిగత లాభం కలుగుతుందన్న విమర్శను మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. తమ కుటుంబం చాలా కాలంగా చక్కెర వ్యాపారంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ విధానానికి మునుపే తాము ఈ రంగంలోకి వచ్చామని చెప్పారు. ఇథనాల్ ఉత్పత్తిలో తమ వాటా చాలా తక్కువని కూడా అన్నారు. తన స్వప్రయోజనాల కోసమే ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నానన్న వాదనను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘ఇవి పూర్తి నిరాధార ఆరోపణలు. ఇథనాల్ ఉత్పత్తిలో కేవలం 0.07 వాటా ఉన్న ఒక వ్యక్తి తన లాభం కోసం కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎలా ప్రభావితం చేయగలడు?’ అని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయని అన్నారు. వాటి ద్వారా ఏటా 1500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోందని అన్నారు. ఇందులో తన వాటా కేవలం 0.07 శాతమేనని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత చమురు భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి భారత ప్రభుత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 'యూజీసీ నెట్' పేపర్ లీకైందని ఆరోపణ

Updated Date - Jul 08 , 2026 | 09:03 PM