నిర్మాణాలపై నిషేధం అవాస్తవం: నీతి ఆయోగ్
ABN , Publish Date - May 13 , 2026 | 05:16 AM
దేశంలో రెండేళ్లపాటు నిర్మాణ రంగంపై నిషేధం విధించాలని తాము సిఫార్సు చేసినట్లు వస్తున్న వార్తలను...
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి) : దేశంలో రెండేళ్లపాటు నిర్మాణ రంగంపై నిషేధం విధించాలని తాము సిఫార్సు చేసినట్లు వస్తున్న వార్తలను నీతి ఆయోగ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘ది ట్రిబ్యూన్’ పత్రికలో ప్రచురితమైన కథనంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని, అందుకే రెండేళ్లపాటు నిర్మాణ పనులను నిలిపివేయాలని నీతి ఆయోగ్ కోరినట్లు సాగుతున్న ప్రచారాన్ని సంస్థ తోసిపుచ్చింది. అటువంటి ప్రతిపాదన ఏదీ తమ నుంచి వెళ్లలేదని పేర్కొంది. అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యాలయ భవనాల పునర్నిర్మాణ పనులు ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని వివరించింది. ఈ పనులను వాయిదా వేయాలని గానీ, నిలిపివేయాలని గానీ తాము ఎలాంటి సిఫార్సు చేయలేదని తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News