యాంటిల్లాల్లో వినాయక చవితి వేడుకలు.. నీతా, రాధిక కాస్ట్యూ్మ్స్ అదుర్స్..
ABN , Publish Date - Sep 15 , 2026 | 01:54 PM
రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం యాంటిల్లాలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అత్తా నీతా అంబానీ, కోడలు రాధికా మర్చంట్ విలాసవంతమైన సంప్రదాయ చీరల్లో సందడి చేశారు. ‘యాంటిల్లా చా రాజా’ పేరుతో చవితి వేడుకలు నిర్వహించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం యాంటిల్లాలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అత్తా నీతా అంబానీ, కోడలు రాధికా మర్చంట్ విలాసవంతమైన సంప్రదాయ చీరల్లో సందడి చేశారు. ‘యాంటిల్లా చా రాజా’ పేరుతో చవితి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు రేఖ, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, రణ్‌బిర్ కపూర్, మాధురీ దీక్షిత్, కృతి సనన్, కాజోల్, కత్రినా కైఫ్, వికీ కౌశల్ తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాది వేడుకల్లో నీతా అంబానీ, రాధికా మర్చంట్ ధరించిన చీరలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. ఆరెంజ్-మాజెంటా రంగుల చీర, షోల్డర్ టు షోల్డర్ నెక్లెస్ ధరించి నీతా ఆకట్టుకున్నారు. ఆరెంజ్-మ్యాజెంటా రంగుల కలయికలో ఉన్న రిచ్ సిల్క్ చీర, దానికి భిన్నమైన బంగారు అంచు ఉండటంతో చీర కట్టుకు పండుగ శోభ మరింత పెరిగింది. ఎప్పట్లాగే ఆ చీరను చాలా ఆభరణాలతో నీతా అలంకరించుకున్నారు. ఇక ఆమె ధరించిన షోల్డర్ టు షోల్డర్ నెక్లెస్‌ను బంగారం, వజ్రాలు, వివిధ రంగుల జెమ్ స్టోన్స్, ముత్యాలతో తయారు చేశారు. అతిథులందరి దృష్టినీ ఆ నెక్లెస్ బాగా ఆకర్షించింది.

రాధిక చీర, నగలు అదరహో..
ఈ కార్యక్రమంలో రాధికా మర్చంట్ కాంజీవరం సిల్క్ చీర ధరించారు. గోల్డ్ జరీతో ఆ చీరను నేశారు. అంతేకాకుండా ఫ్యాబ్రిక్‌ను పాతకాలం నాటి బంగారు రంగు మోరడి ఎంబ్రాయిడరీ, జర్దోసీ పనితో మరింత అందంగా అలంకరించారు. ఆ చీర డిజైన్ చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాధారణంగా ఆరు గజాల చీరలా కాకుండా, కాంజీవరం చీరను ముందే కుట్టి సిద్ధంచేసిన స్కర్ట్ రూపంలో రూపొందించారు. చీరకు తోడు ఆమె ధరించిన నగలు, గాజలు కూడా కార్యక్రమానికి మరింత శోభ తీసుకొచ్చాయి. వివిధ రకాల ముత్యాలు, వజ్రాలతో ఆ నగలు, గాజులను తయారు చేశారు. అంతేకాకుండా వేడుకల్లో ఆమె తన భరతనాట్య ప్రదర్శనతో అతిథులను అలరించారు.

Also Read:
కెనడా నుంచి నలుగురు పంజాబ్ యువకుల బహిష్కరణ.. కారణం ఇదే..
అమరావతి జేఏసీ సభ్యుడు రామారావు కన్నుమూత
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు