గ్రేటర్ నోయిడాలో నిర్భయలాంటి ఘటన.. కదిలే బస్సులో బాలికను..
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:20 PM
నిర్భయ కేసును గుర్తుచేసేలా గ్రేటర్ నోయిడాలో అలాంటిదే మరో ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు కీచకులు
ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్ నోయిడాలో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. కదిలే బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు కీచకులు. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్లను గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఎవరూ లేని బస్సులో తనపై అత్యాచారం జరిగిందని సదరు బాలిక ఫిర్యాదు చేయగా.. ఆ మేరకు బస్సు డ్రైవర్ కుల్‌దీప్, కండక్టర్ సందీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఆగస్టు 4వ తేదీన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో గొడవ పడి నోయిడాలోని తన సోదరి నివాసానికి వెళ్లాలని ఓ బాలిక బయలుదేరింది. అయితే ఆరోజు వర్షం కురవడంతో బస్సులు రావడానికి ఆలస్యమైంది. అప్పుడే విశ్వనాథ్ ట్రావెల్స్ పేరుతో నోయిడాకే వెళ్తున్న ఓ ప్రైవేటు స్లీపర్ బస్సు ఆమెకు కనిపించింది. అందులో డ్రైవర్, కండక్టర్ తప్ప ప్రయాణికులు ఎవరూ లేరు. అప్పటికే చీకటి పడడంతో త్వరగా వెళ్లాలని ఆమె బస్సు ఎక్కింది. బస్సు కొంత దూరం వెళ్లాక కండక్టర్ తన దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఆ తరువాత తనపై లైంగిక దాడి చేశారని వాపోయింది. చివరికి తనను ఢిల్లీ కాశ్మీరీ గేట్ రింగురోడ్డు వద్ద దింపేశారని ఆమె పోలీసులకు తెలిపింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్లీపర్ బస్సుకు కర్టెన్లు ఉండడంతో ఎవరికీ కనిపించకుండా ఉంటామనే ధైర్యంతో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బస్సు నుంచి ఫారెన్సిక్ ఆధారాలు సేకరించామని వివరించారు. ఇప్పటికే పోలీసులు బస్సును సీజ్ చేశారు.
Also Read:
కేసీఆర్ రాజీనామా చేయాలి.. ఆందోళనలకు పిలుపునిచ్చిన సీఎం
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
టానింగ్, పిగ్మెంటేషన్ మధ్య తేడా ఏమిటి?