నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు.. లండన్‌లో పిటిషన్ తిరస్కరణ
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:57 PM
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురైంది. భారత్‌కు రాకుండా ఉండేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి (Nirav Modi) లండన్‌లో మరోసారి చుక్కెదురైంది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఆఫ్ జస్టిస్ కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్నారు. ఆయనను స్వదేశానికి పంపించాలని భారత్ కోరగా గతేడాది అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ నీరవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత్ జైళ్లల్లో పరిస్థితులు, భద్రతపై భారత అధికారులు ఇచ్చిన హామీలు సందేహాస్పదమని వాదించారు. ఈ విషయంపై మరోసారి దృష్టిసారించాలని అన్నారు. కానీ కోర్టు నీరవ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత ఆదేశాలను మళ్లీ సమీక్షించేందుకు కారణాలు ఏవీ లేవని పేర్కొంది.
నీరవ్ మోదీ కేసులో సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఆయనను భారత్‌కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆయనపై పలు కేసులు ఉండటంతో ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. పీఎన్‌బీ బ్యాంకుకు చెందిన లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్‌తో నీరవ్, ఆయన బంధువు మేహుల్ చోస్కీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు