బావిలోకి కారు..ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:04 AM
ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లడంతో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘోర...
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోరం
నాసిక్, ఏప్రిల్ 4: ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లడంతో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్ల పక్కన, ప్రజలు తిరిగే ప్రాంతాల్లోని బావుల పరిస్థితి, వాటి వద్ద రక్షణ చర్యలపై తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి డిండోరి పట్టణంలోని శివాజీనగర్ ప్రాంతంలో ఓ విందుకు హాజరైన సునీల్ దత్ దర్గుడే (32) కుటుంబం కారులో వెనుదిరిగింది. ఈ నేపథ్యంలోనే అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రెండు క్రేన్లు, గజ ఈతగాళ్ల సాయంతో కారును, అందులోని వారిని వెలికితీశారు. సునీల్ దర్గుడేతో పాటు ఆయన భార్య రేష్మా, ఆశా అనిల్ దర్గుడే (32)తో పాటు 11 ఏళ్ల బాలుడు, 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు అమ్మాయిలు మృతి చెందినట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు