బహిర్భూమి కోసం విద్యార్థులు అడవికి వెళ్తున్నారా?
ABN , Publish Date - May 12 , 2026 | 05:49 AM
ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బహిర్భూమి కోసం అటవీ ప్రాంతానికి వెళ్తున్నారన్న ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదుదారు...
2 వారాల్లోగా కలెక్టర్ నివేదిక ఇవ్వాలి: ఎన్‌హెచ్‌ఆర్సీ
బొమ్మారెడ్డిగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల
ఇబ్బందులపై న్యాయవాది బాలచందర్‌రెడ్డి ఫిర్యాదు
న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బహిర్భూమి కోసం అటవీ ప్రాంతానికి వెళ్తున్నారన్న ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదుదారు చెబుతున్న అంశాలు నిజమని తేలితే.. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లాలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థులు అడవిలోకి వెళ్లాల్సి వస్తోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనంటూ న్యాయవాది బాలచందర్ రెడ్డి గతంలో ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘‘బొమ్మారెడ్డిగూడెం ఆశ్రమ పాఠశాలలో 16 మరుగుదొడ్లు ఉండగా... వాటిలోనూ 6 పనిచేయడం లేదు. ఇవి కనీసం 150 మందికైనా సరిపోని పరిస్థితి ఉండగా.. ఇక్కడ 275 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. దీంతో విద్యార్థులను బహిర్భూమి కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్తున్నారు.‘ అని బాలచందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందిస్తూ.. రెండు వారాల్లోగా కార్యాచరణ నివేదికను సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని రిజిస్ట్రీకి సూచించింది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్