తదుపరి సీబీఐ చీఫ్ ఎంపికపై 12న ఉన్నత స్థాయి భేటీ!
ABN , Publish Date - May 07 , 2026 | 07:31 AM
సీబీఐ తదుపరి డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 12న భేటీ కానుందని సమాచారం. ప్రధాని నేతృత్వంలోని...
న్యూఢిల్లీ, మే 6: సీబీఐ తదుపరి డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 12న భేటీ కానుందని సమాచారం. ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉంటారు. ప్రస్తుత సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారా.. లేదా కొత్త వ్యక్తిని నియమిస్తారా.. అనే దానిపై ఉన్నత స్థాయి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిష్ఠాత్మక పదవి కావడంతో 1989 నుంచి 1992 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) సిద్ధం చేస్తోంది. రీసెర్చ్, అనాలిస్ వింగ్ (రా) చీఫ్ పరాగ్ జైన్, ప్రస్తుత మహారాష్ట్ర డీజీపీ సదానంద్ దాతే, అజయ్‌కుమార్ శర్మతో పాటు సీనియర్ ఐపీఎ్‌సలు శత్రుజీత్ సింగ్ కపూర్, జీపీ సింగ్, పీయూష్ ఆనంద్, సతీశ్ గోల్చాలు పోటీలో ఉండే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ