Share News

పుట్టింట్లో భార్య ఆత్మహత్య.. ఆ బాధను భరించలేకపోయిన భర్త..

ABN , Publish Date - May 23 , 2026 | 05:45 PM

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య మరణించిన రెండు రోజులకే భర్త కూడా మరణించాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పెళ్లైన నెల రోజుల్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

పుట్టింట్లో భార్య ఆత్మహత్య.. ఆ బాధను భరించలేకపోయిన భర్త..
Newly Married Couple

భోపాల్, మే 23: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య మరణించిన రెండు రోజులకే భర్త కూడా మరణించాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పెళ్లైన నెల రోజుల్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని హురావాలి లింక్ రోడ్‌కు చెందిన 23 ఏళ్ల మేఘన అలియాస్ జ్యోతికి పింటూ పార్క్ ఏరియాకు చెందిన 26 ఏళ్ల సిద్ధార్థ్ కండిల్‌తో ఏప్రిల్ 25వ తేదీన పెళ్లైంది. మే 1వ తేదీన మేఘన పుట్టింటికి వచ్చింది. బుధవారం మేఘన తండ్రి గురువీర్ వేరే ఊరికి వెళ్లాడు.


ఇంట్లో మేఘన, ఆమె తల్లి గీత మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం ఫస్ట్ ఫ్లోర్‌లోని మేఘన గదికి వెళ్లింది గీత. గదిలో మేఘన ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్య మరణంతో సిద్ధార్థ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. శుక్రవారం బాత్‌రూములోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చనిపోయిన రెండు రోజులకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.


కలిసున్నది 5 రోజులే..

పెళ్లైన నెల రోజుల్లోనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటన స్థానిక ప్రజలను విషాదంలో ముంచేసింది. ఇక్కడ బాధాకరమైన ఇంకో విషయం ఏంటంటే.. భార్యాభర్తలు ఇద్దరూ కేవలం ఐదు రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ.. మేఘన పుట్టింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజులకు భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు వీరి చావుకు కారణం అన్వేషించే పనిలో పడ్డారు. పోస్టుమార్టం రిపోర్టులు, కాల్ రికార్డ్స్ ద్వారా భార్యాభర్తల చావుకు కారణం ఏంటో తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీతో మార్కో రుబియో భేటీ.. భారత్-అమెరికా సంబంధాలపై కీలక చర్చలు..

ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే కష్టం: ఎల్ఎస్‌జీ యువ ప్లేయర్

Updated Date - May 23 , 2026 | 06:10 PM