నేపాల్ కాబోయే ప్రధాని బెంగళూరు విద్యార్థి
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:33 AM
పాల్ కాబోయే ప్రధాని బాలేంద్ర షా బెంగళూరులో చదువుకున్నారు. నగరంలోని నిట్టే మీనాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన 2016-18 విద్యాసంవత్సరంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో...
బెంగళూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): నేపాల్ కాబోయే ప్రధాని బాలేంద్ర షా బెంగళూరులో చదువుకున్నారు. నగరంలోని నిట్టే మీనాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన 2016-18 విద్యాసంవత్సరంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. బెళగావి విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఇది అనుబంధ కళాశాల. నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పతనమయ్యాక జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్‌ఎ్‌సపీ) సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఆ పార్టీ నాయకుడు బాలేంద్ర షా ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఆయన ఇంతకు ముందు ఖాఠ్మండూ నగర మేయర్‌గా సేవలు అందించారు. రాజకీయాల్లోకి రాకమునుపు ర్యాపర్‌గా గుర్తింపు పొందారు. అవినీతి, దేశంలోని అస్థిర రాజకీయాలపై ఆయన పాడిన కవితలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నాలుగుసార్లు ప్రధానిగా వ్యవహరించిన కేపీ శర్మ ఓలీపై ఆయన 4,842 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నేపాల్ కాబోయే ప్రధాని తమ పూర్వ విద్యార్థి కావడం సంతోషంగా ఉందని పలువురు అఽధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ