Share News

భారత మామిడి దిగుమతులకు నేపాల్‌ ఓకే

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:40 AM

భారత్‌ నుంచి వచ్చే మామిడి పండ్ల దిగుమతులపై తాము ఎలాంటి నిషేధం విధించలేదని నేపాల్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది...

భారత మామిడి దిగుమతులకు నేపాల్‌ ఓకే

ఖాట్మండు, జూన్‌ 11: భారత్‌ నుంచి వచ్చే మామిడి పండ్ల దిగుమతులపై తాము ఎలాంటి నిషేధం విధించలేదని నేపాల్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా, కొన్ని నిబంధనల ప్రకారం భారత మామిడి పండ్లను దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. భారత మామిడి పండ్లలో అధిక స్థాయిలో రసాయనాలు, పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో తగిన క్వారంటైన్‌ సౌకర్యాలు లేవన్న కారణాలతో దిగుమతులను నేపాల్‌ నిషేధించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ నేపాల్‌ వ్యవసాయశాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:40 AM