Share News

విద్యార్థి నాగ్‌పూర్‌లో.. నీట్ పరీక్ష కేంద్రం యూఏఈలో..

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:17 AM

నీట్ రీటెస్టుకు సంబంధించి తనకు యూఏఈలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారని నాగ్‌పూర్‌కు (మహారాష్ట్ర) చెందిన ఒక విద్యార్థి తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్‌టీఏ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు విద్యార్థి తండ్రి చెప్పారు.

విద్యార్థి నాగ్‌పూర్‌లో.. నీట్ పరీక్ష కేంద్రం యూఏఈలో..
Error in NEET Admit Card

ఇంటర్నెట్ డెస్క్: నీట్ రీటెస్టుకు సంబంధించి తనకు యూఏఈలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారని నాగ్‌పూర్‌కు (మహారాష్ట్ర) చెందిన ఒక విద్యార్థి తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్‌టీఏ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు విద్యార్థి తండ్రి చెప్పారు. ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో రద్దైన నీట్ ఎంట్రన్స్ పరీక్షను రేపు మరోసారి నిర్వహించనున్న విషయం తెలిసిందే.

రీ-నీట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుని చూస్తే జరిగిన పొరపాటు గురించి తెలిసిందని అబ్దుల్లా మొహమ్మద్ తాలిబ్ అనే విద్యార్థి తెలిపాడు. తాను భారత్‌లో ఉంటే తన పరీక్ష కేంద్రం మాత్రం యూఏఈలో ఉన్నట్టు అడ్మిట్ కార్డులో కనిపించిందని అన్నాడు. నాగ్‌పూర్‌లో పరీక్ష కేంద్రం కోసం అతడు దరఖాస్తు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ విషయం ఎన్‌టీఏ దృష్టికి తీసుకెళ్లగా సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని సంస్థ తెలిపినట్టు విద్యార్థి తండ్రి తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని, సవరించిన అడ్మిట్ కార్డును జారీ చేస్తామని పేర్కొన్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎన్‌టీఏ నుంచి ఈమెయిల్ వచ్చిందని వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..

నీట్‌కు సర్వం సిద్ధం

Updated Date - Jun 20 , 2026 | 12:28 PM