ఎన్‌సీఈఆర్‌టీ కరికులం కమిటీలో ముగ్గురు సభ్యులపై వేటు
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:31 AM
పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలకమైన కరికులం కమిటీని ఎన్‌సీఈఆర్‌టీ పునర్వ్యవస్థీకరించింది. గతంలో 22మంది సభ్యులతో...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలకమైన కరికులం కమిటీని ఎన్‌సీఈఆర్‌టీ పునర్వ్యవస్థీకరించింది. గతంలో 22మంది సభ్యులతో ఉన్న సిలబస్ కమిటీ నుంచి ముగ్గురిని తొలగించి 20మందితో కూడిన నూతన కమిటీని బుధవారం ప్రకటించింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ చైర్మన్ రాఘవేంద్ర తన్వర్, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా మాజీ వీసీ ఆర్. వెంకటరావు, అమరేంద్ర ప్రసాద్ బెహరా వంటి ప్రముఖ విద్యావేత్తలకు ప్యానెల్‌లో చోటు కల్పించింది. ఐఐటీ గాంధీనగర్ మాజీ ప్రొఫెసర్ మిచెల్ డానినో, ఎండీ శ్రీనివాస్, ప్రధాన ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్‌లు తొలగించిన వారి జాబితాలో ఉన్నారు. ఎనిమిదో తరగతి సోషల్‌సైన్స్ పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..