Share News

ఘోరం.. అధ్వానం!

ABN , Publish Date - May 13 , 2026 | 05:26 AM

వ్యవస్థలు విఫలమైతే పర్యవసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పేందుకు నాసిక్‌ టీసీఎ్‌సలో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల ఉదంతమే...

ఘోరం.. అధ్వానం!

  • 8 నాసిక్‌ టీసీఎ్‌సలోని పరిస్థితులపై జాతీయ మహిళా

కమిషన్‌ దిగ్ర్భాంతి..‘పోష్‌’ కమిటీ నిద్రపోతోందని ఆక్షేపణ

  • వేధింపులు, మత మార్పిళ్లకు యత్నం జరిగిందని నివేదిక

న్యూఢిల్లీ, మే 12: వ్యవస్థలు విఫలమైతే పర్యవసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పేందుకు నాసిక్‌ టీసీఎ్‌సలో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల ఉదంతమే నిదర్శనమని జాతీయ మహిళా కమిషన్‌ వ్యాఖ్యానించింది. ఆ సంస్థలో అన్ని స్థాయుల్లో లైంగిక వేధింపుల విష సంస్కృతి అల్లుకుపోయిందని తేల్చింది. పని స్థలాల్లో సాధారణంగా వెలుగుచూసే లైంగిక వేధింపుల ఘటనలతో పోల్చితే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయని తెలిపింది. పని స్థలాల్లో మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే ‘పోష్‌’ చట్టం(ప్రివెంటివ్‌, ప్రొబిషన్‌ అండ్‌ రిడ్రెస్సల్‌ యాక్ట్‌) అమలులో ఆ కంపెనీ పూర్తిగా నిద్రపోతున్నదని ఆక్షేపించింది. ఈ మేరకు నాసిక్‌ టీసీఎ్‌సపై నిజ నిర్ధారణ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. బాధితులు నాసిక్‌ టీసీఎస్‌ వ్యవహారంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని జాతీయ మహిళా కమిషన్‌ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ గత నెల 18, 19 తేదీల్లో నాసిక్‌లో పర్యటించింది. బాధితులను, ‘పోష్‌’ కమిటీ సభ్యులను, పోలీసు అధికారులను, సాక్షులను కలిసి మాట్లాడింది. 25 సిఫారసులతో నివేదికను అందించింది. ‘‘నిందితులకు కంపెనీ వ్యవహారాలపై పూర్తి ఆధిపత్యం ఉంది. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితుల్లోని యువతులను వీరు లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు, మానసికంగా ఒత్తిళ్లకు గురిచేసేవారు. హిందూ ధర్మశాస్ర్తాలు, ఆచారాలు, విశ్వాసాలను దూషించడం ద్వారా ఆ మతం కంటే ఇస్లామే ఉన్నతమైనదనే భావన కలిగించే ప్రయత్నం చేసేవారు. లైంగిక వేధింపులకు, అత్యాచార ప్రయత్నాలకు ఒడిగట్టారు’’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 05:26 AM