ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. బెయిల్ మీద బయటకు వచ్చిన 2 వారాల్లోనే..
ABN , Publish Date - Aug 21 , 2026 | 03:34 PM
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కారణంగా ఓ గ్యాంగ్‌స్టర్ మరో గ్యాంగ్‌స్టర్ చేతిలో హత్యకు గురైన ఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కారణంగా గ్యాంగ్‌స్టర్ హత్యకు గురైన ఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్‌పూర్‌కు చెందిన 27 ఏళ్ల గౌరవ్ పంకజ్ రగ్డే.. రాణి అనే యువతి గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పంకజ్ రగ్డేపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం అతడు జైలు పాలయ్యాడు. పంకజ్ రగ్డే జైలులో ఉన్న సమయంలో రాణికి గౌరవ్ రౌత్ అనే మరో గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.
నేర ప్రపంచానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో రాణి క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టింది. గౌరవ్ రౌత్, రాణి కలిసి నాగేంద్ర నగర్ ఏరియాలో ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. రెండు వారాల క్రితం రగ్డే బెయిల్ మీద రిలీజ్ అయి బయటకు వచ్చాడు. రాణి, గౌరవ్ రౌత్ రిలేషన్ ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని అతడికి తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన రగ్డే.. గౌరవ్ రౌత్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో రౌత్‌తో పాటు అతడి ఫ్రెండ్ ఉన్నాడు. తలుపు లోపలినుంచి లాక్ చేసి ఉండటంతో.. రగ్డే కిటికీలోనుంచి ఇంట్లోకి రాళ్లు విసరటం మొదలెట్టాడు.
భయపడిపోయిన రౌత్, అతడి స్నేహితుడు ఇంటి వెనకాల ఉన్న తలుపునుంచి తప్పించుకుని బయటకు పారిపోయారు. రగ్డే వారిని కత్తితో వెంబడించాడు. సుందర్బన్ నాలా దగ్గర రగ్డే ఇద్దరినీ అడ్డగించాడు. వారిపై దాడి చేయటం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలోనే రౌత్ స్నేహితుడు వస్నిక్ అక్కడికి వచ్చాడు. ముగ్గురూ కలిసి రగ్డే చేతిలోని కత్తిని లాక్కున్నారు. ఆ కత్తితో రగ్డే మీద దాడి చేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ రగ్డేను ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
హైకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. సెప్టెంబర్ 16న తీర్పు
స్పిన్ ఉచ్చులో చిక్కకుండా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న శుభ్‌మన్ గిల్