36 టన్నుల చేపలు ధ్వంసం చేసిన అధికారులు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:20 PM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా పెంచుతున్న నిషేధిత థాయ్ మాగుర్ జాతి చేపలను మత్స్యశాఖ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. 36 టన్నులకు పైగా చేపలను ధ్వంసం చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా పెంచుతున్న నిషేధిత థాయ్ మాగుర్ జాతి చేపలను మత్స్యశాఖ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని 11 చెరువుల నుంచి స్వాధీనం చేసుకున్న 36 టన్నులకు పైగా చేపలను ధ్వంసం చేశారు. ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ (థాయ్ మాగూర్) పర్యావరణానికి, జలచరాల సమతుల్యతకు, ప్రజల ఆరోగ్యానికి హానికరమనే కారణంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) వీటి సాగును పూర్తిగా నిషేధించింది. అయినప్పటికి కొంతమంది అక్రమంగా వీటిని సాగుచేస్తున్నారు.
మర్షివ్నీ తాలూకాలోని చిచోలీ - మహాదులా ఏరియాలో పలు చెరువుల్లో నిషేధిత థాయ్ మాగూర్ చేపలను పెంచుతున్నారని మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. 25 మంది స్థానిక మత్స్యకారులతో కలిసి అధికారులు రైయిడ్స్ నిర్వహించారు. 11 చెరువులలో 36 టన్నుల థాయ్ మాగూర్ చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చేపలను ట్రాక్టర్లలో అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఓ పెద్ద గొయ్యి తవ్వి వాటిని పూడ్చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
పాప్‌కార్న్‌ను జంక్‌ఫుడ్ అనుకుంటున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. నలుగురి అరెస్ట్