4 నెలలుగా వీక్లీ ఆఫ్ ఇవ్వలేదని యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:08 AM
నాలుగు నెలలుగా వీక్లీ ఆఫ్, సెలవు ఇవ్వకుండా సూపర్‌వైజర్ వేధించడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది...
బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలలుగా వీక్లీ ఆఫ్, సెలవు ఇవ్వకుండా సూపర్‌వైజర్ వేధించడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మైసూరులోని హినకల్‌లో శనివారం చోటు చేసుకుంది. మైసూరుకు చెందిన నాగేశ్వరి(24) టాటా కంపెనీలో ప్రమోటర్‌గా పనిచేసేవారు. అదే కంపెనీకి 4నెలల కిందట డాలీ అనే మహిళ సూపర్‌వైజర్‌గా వచ్చారు. తాను ఏ తప్పూ చేయకపోయినా ఆమె తనను టార్గెట్ చేశారని, వేధించారని నాగేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వీక్లీ ఆఫ్‌తోపాటు ఒక సెలవు కూడా ఇవ్వలేదని, అత్యవసర పరిస్థితి ఉందని, ఒకరోజు సెలవు కావాలని కోరినా మంజూరు చేయలేదని, తర్వాత ఉద్యోగం నుంచి తీసేశారని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ