బాలీవుడ్ సెలబ్రిటీలకు వై ప్లస్ సెక్యూరిటీ
ABN , Publish Date - Nov 15 , 2026 | 09:36 PM
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై దాడి నేపథ్యంలో ముంబై పోలీసులు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై దాడి నేపథ్యంలో ముంబై పోలీసులు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇద్దరు టాప్ స్టార్లకు తాజాగా వై ప్లస్ సెక్యూరిటీని కల్పించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఓ ప్రముఖ యాక్టర్ సెక్యూరిటీని ఎక్స్ నుంచి వై ప్లస్ కేటగిరీకి పటిష్ఠం చేశారు. మరో యాక్టర్ సెక్యూరిటీని కూడా వై నుంచి వై ప్లస్‌కు పెంచారు. అయితే,భద్రతా కారణాల రీత్యా ఆ నటులు ఎవరనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉన్న వారితో పాటు ముప్పు ఎదుర్కొంటున్న వారికి సన్నిహితంగా ఉండే వ్యక్తులకు కూడా సెక్యూరిటీ పెంచినట్టు తెలుస్తోంది. ఆయా వ్యక్తుల కుటుంబాలు, సన్నిహితులకు భద్రత పెంచారు.
అక్టోబర్ 18న గుర్తుతెలియని ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ నటుడికి ఎలాంటి ముప్పు కలగలేదు. వెటరన్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంటిపై దాడి యత్నానికి చెక్ పెట్టామని నవంబర్ 14న ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు షూటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్టు.. ఐఎస్ఐ పాత్రపై ఆరా..
9.5 ఏళ్లలో 9.5 లక్షల ఉద్యోగాలిచ్చాం.. యూపీ సీఎం యోగి