Rs.7.65 theft case: రూ.7 దొంగతనం కేసు.. 50 ఏళ్ల తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:37 PM
మహారాష్ట్రలో యాభై ఏళ్ల క్రితం నాటి ఓ చోరీ కేసుకు సంబంధించి కోర్టు తుది తీర్పు వెలువడింది. ఎన్నో ఏళ్లు నిందితుల గురించి పోలీసులు వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కోర్టు ఈ కేసుకు ముగింపు పలికింది. ఇంతకీ చోరీ అయిన మొత్తం ఎంతో తెలుసా.. 7.65 రూపాయలు.
మహారాష్ట్రలో యాభై ఏళ్ల క్రితం నాటి ఓ చోరీ కేసుకు సంబంధించి ముంబై కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. ఎన్నో ఏళ్లు నిందితుల గురించి పోలీసులు వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కోర్టు ఈ కేసుకు తాజాగా ముగింపు పలికింది. ఇంతకీ చోరీ అయిన మొత్తం ఎంతో తెలుసా.. 7.65 రూపాయలు (minor theft case).
50 ఏళ్ల క్రితం, అంటే 1977లో రూ. 7.65 అంటే కొంచెం పెద్ద మొత్తమే. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఎంత ప్రయత్నించినా నిందితులను మాత్రం పట్టుకోలేకపోయారు. దక్షిణ ముంబైలోని మజగావ్ న్యాయస్థానం తాజాగా పాత కేసులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 1977 నాటి రూ.7.65 కేసు వెలికి తీసింది. 1977 నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. రూ.7.65 చోరీ కేసులో అప్పట్లో ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు అందింది. ఆ ఇద్దరి కోసం పోలీసులు ఎంత గాలించినా, అనేక సార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా ప్రయోజనం లేకపోయింది (50 year old case closed).
దాదాపు 50 ఏళ్లుగా మరుగున పడి ఉన్న ఈ కేసు ఇటీవల విచారణకు వచ్చింది (pending cases in courts). ఈ కేసును పెండింగ్‌లో ఉంచడంలో అర్థం లేదని మజగావ్ న్యాయస్థానం అభిప్రాయపడింది. దాదాపు 50 ఏళ్ల నాటి ఈ కేసులో ఎటువంటి పురోగతీ లేకపోడంతో నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది.
ఇవి కూడా చదవండి..
వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..