భయపడకు బిడ్డా.. కాపాడుకుంటా!
ABN , Publish Date - May 02 , 2026 | 06:10 AM
భయపడకు నాన్నా.. నేనున్నా.. నీకేం కాదు.. నేను నిన్ను కాపాడుకుంటా.. అని ఆ తల్లి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిందేమో.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో...
మధ్యప్రదేశ్ పడవ ప్రమాదంలో తల్లి, నాలుగేళ్ల కొడుకు మృతి
బిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలనూ లెక్క చేయని తల్లి
ప్రమాదంలో మొత్తం 9మంది మృతి.. ఆరుగురు గల్లంతు
జబల్‌పూర్, మే 1: భయపడకు నాన్నా.. నేనున్నా.. నీకేం కాదు.. నేను నిన్ను కాపాడుకుంటా.. అని ఆ తల్లి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిందేమో.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అని చివరిశ్వాస వరకు ఎదురు చూసిందేమో.. తన ప్రాణాలను లెక్కచేయకుండా కొడుకును అదిమి పట్టుకొని, ప్రాణాలను వదిలేసింది ఆ తల్లి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్‌లో పడవ మునిగిన ఘటనలో చనిపోయిన ఈ తల్లీకొడుకుల చిత్రం అందరినీ కలచివేస్తోంది. బర్గి డ్యామ్ నర్మదా నదిపై ఉంది. ఈ డ్యామ్‌లో గురువారం సాయంత్రం ఓ పర్యాటక పడవ తుఫాను లాంటి బలమైన గాలుల కారణంగా తిరగబడింది. దీంతో, 9 మంది నీట మునిగి చనిపోయారు. ఆరుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలను గురువారమే వెలికితీయగా, శుక్రవారం మరో ఐదు మృతదేహాలను బయటకు తీశారు. శుక్రవారం వెలికితీసిన ఐదు మృతదేహాల్లో ఈ తల్లి, ఆమె నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వీరిద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఉన్న ఆ దృశ్యం అక్కడ ఉన్నవారికి కంటతడి తెప్పించింది.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ