Share News

రుతుపవనాల మంద గమనం

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:52 AM

దక్షిణ, ఈశాన్య భారతంలో ఎక్కువ ప్రాంతాలకు వేగంగా విస్తరించిన అనంతరం రుతుపవనాల పురోగతి మందగించింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని

రుతుపవనాల మంద గమనం

  • మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం ఎదురుచూపులు

  • అల్పపీడనాలు ఏర్పడితేనే ప్రభావం: స్కైమెట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): దక్షిణ, ఈశాన్య భారతంలో ఎక్కువ ప్రాంతాలకు వేగంగా విస్తరించిన అనంతరం రుతుపవనాల పురోగతి మందగించింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని అనేక ప్రాంతాలు ఇంకా రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలలో అసాధారణంగా దీర్ఘకాలం అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడకపోవడమే దీనికి కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ తెలిపింది. 2025 చివరిలో దిత్వా తుఫాను ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గుర్తించేస్థాయిలో తుఫాను వ్యవస్థ ఏమీ ఏర్పడలేదని పేర్కొంది. రుతుపవనాల పురోగతికి ఈ వ్యవస్థలు డ్రైవర్లవలే పనిచేస్తాయని, తేమ గాలులను భూమిపైకి నెట్టడంలో దోహదం చేస్తాయని, తద్వారా భారత భూభాగంపై రుతుపవనాల విస్తరణ వేగాన్ని పెంచుతాయని వివరించింది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:52 AM