నేటి యువతకు ఆర్డర్లు ఇస్తే కుదరదు
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:41 AM
నేటి యువతకు ఆదేశాలు ఇస్తే కుదరదని.. వారికి వివరణ అవసరమని ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అందువల్ల వారితో అర్థవంతమైన చర్చలు జరపాలే తప్ప...
వారికి వివరణ అవసరం.. ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్
న్యూఢిల్లీ, జూలై 25: నేటి యువతకు ఆదేశాలు ఇస్తే కుదరదని.. వారికి వివరణ అవసరమని ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అందువల్ల వారితో అర్థవంతమైన చర్చలు జరపాలే తప్ప... చెప్పింది చెయ్యి అనే ధోరణి సరికాదన్నారు. పోటీ పరీక్ష పత్రాల లీకేజీలపై యువత ఉద్యమం వేళ మోహన్ భగవత్‌చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విశ్వ మాంగల్య సభ కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడుతూ... నేడు తరాల మధ్య అంతరం పెరిగిపోయిందని... యువతకు సరైన మార్గదర్శకత్వం అవసరమని అన్నారు. నేటి యువత ప్రశ్నించడానికి ప్రాధాన్యం ఇస్తోందని, అందువల్ల తల్లిదండ్రుల, పెద్దవాళ్లు వారితో మరింతగా మాట్లాడాల్సి ఉందన్నారు. యువతరం వేసే ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారితో ఎంతో ఆప్యాయంగా మెలగాలని, చర్చించాలని సూచించారు. అయితే, భగవత్ సీజేపీ ఉద్యమంపై ఎటువంటి ప్రస్తావనా చేయలేదు. దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ శుక్రవారం ‘ఎక్స్’ ద్వారా ప్రశ్నించారు. జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు జరుగుతున్నా... మీరు నెల రోజులుగా నిశబ్దంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఆర్‌ఎ్‌సఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ శుక్రవారం మాట్లాడుతూ.. సీజేపీ ఉద్యమం వెనుక దేశ, విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. భారత్ అభివృద్ధి చెందిన, బలమైన, విద్యావంతుల దేశంగా మారడం వాటికి ఇష్టం లేదని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు