Share News

కులగణనపై మోదీ యూటర్న్‌: జైరాం రమేశ్‌

ABN , Publish Date - May 01 , 2026 | 06:13 AM

దేశవ్యాప్త కులగణన విషయంలో మోదీ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌...

కులగణనపై మోదీ యూటర్న్‌: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త కులగణన విషయంలో మోదీ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. రాబోయే జనగణనలో కులగణనను చేర్చుతామని ఏడాది క్రితం ప్రకటించిన మోదీ.. ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదని గురువారం సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. కులగణన కావాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తే, అది ‘‘అర్బన్‌ నక్సల్‌’’ ఆలోచన అని ప్రధాని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆయనే కులగణన చేస్తామని ప్రకటించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ‘‘అర్బన్‌ నక్సల్‌’’ అన్న మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:13 AM