ఆన్‌లైన్ క్లాసులకు మారండి
ABN , Publish Date - May 12 , 2026 | 05:46 AM
పెట్రోల్, డీజిల్, వంటనూనెల వాడకాన్ని తగ్గించుకోవాలని.. బంగారం కొనుగోళ్లను మానుకోవాలని ఆదివారం హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు...
కష్టాలున్నాయి.. ఖర్చులు తగ్గించుకోండి
ప్రజలకు ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి
వడోదర, మే 11: పెట్రోల్, డీజిల్, వంటనూనెల వాడకాన్ని తగ్గించుకోవాలని.. బంగారం కొనుగోళ్లను మానుకోవాలని ఆదివారం హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. సోమవారం కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు. వడోదరలో పటీదార్ వర్గం నిర్మించిన సర్దార్ దామ్ హాస్టల్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అందువల్ల మనం కూడా ఇంధనం, వంటనూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని అన్నారు. భారతీయులు విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో వివాహాలను మానుకోవాలని సూచించారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారాలని, పాఠశాలలు కూడా కొంతకాలం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలు తరిగిపోయే పనులు చేయకపోవటం దేశానికి మంచిదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్