త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?
ABN , Publish Date - May 13 , 2026 | 05:19 AM
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో...
న్యూఢిల్లీ, మే12 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 15 నుంచి 20 వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చునని తెలుస్తోంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం. నరేంద్ర మోదీ 2024 జూన్ 9న మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండేళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అంతేకాక ఈసారి యువ నేతలకు, మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నారని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News