Share News

పశ్చిమాసియా సంక్షోభంపై కాంగ్రెస్‌ రాజకీయం

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:49 AM

పశ్చిమాసియా సంక్షోభంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఎన్నికల సభలో...

పశ్చిమాసియా సంక్షోభంపై కాంగ్రెస్‌ రాజకీయం

  • భారతీయుల పరిస్థితి దిగజారేలా ప్రకటనలు: మోదీ

కొచ్చి, మార్చి 11: పశ్చిమాసియా సంక్షోభంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. సంక్షోభం కారణంగా గల్ఫ్‌ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. ఇంతటి సంక్షోభ వేళ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితి దిగజారేలా బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తోందని మోదీ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి రాహుల్‌ గాంధీకి అవగాహన లేదన్నారు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 05:49 AM