Share News

స్టాలిన్‌కు కొళత్తూరు కన్నీటి స్వాగతం

ABN , Publish Date - May 06 , 2026 | 05:30 AM

తనకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను చూసి ప్రజలు...

స్టాలిన్‌కు కొళత్తూరు కన్నీటి స్వాగతం

కొళత్తూరు ప్రజలకు స్టాలిన్‌ అభివాదం

  • ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లిన మాజీ సీఎం

చెన్నై, మే 5(ఆంధ్రజ్యోతి): తనకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను చూసి ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సాయంత్రం 5.45 గంటలకు కొళత్తూరు నియోజకవర్గానికి వెళ్లిన స్టాలిన్‌ వాహనంపై పలు ప్రధాన రహదారుల్లో పయనించారు. దారి పొడవునా మహిళలు, యువకులు చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. కార్యకర్తలు డీఎంకే జెండాలు పట్టుకుని ‘డీఎంకే వర్థిల్లాలి, స్టాలిన్‌ వర్థిల్లాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తనను చూసి ఏడుస్తున్న పార్టీ శ్రేణులను అదుపుచేయడానికి స్టాలిన్‌ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పార్టీ శ్రేణులను చూసి స్టాలిన్‌ కళ్లు కూడా చెమర్చాయి. స్టాలిన్‌ వెనుకే నిలిచిన మాజీ మంత్రి, హార్బర్‌ ఎమ్మెల్యే పీకే శేఖర్‌బాబు పార్టీ శ్రేణులు విలపించడాన్ని చూసి తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా, డీఎంకే ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం 5 గంటలకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ కానున్నారు. వారంతా తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 05:30 AM