కొడైకెనాల్‌లో సైక్లింగ్‌తో సందడి చేసిన సీఎం స్టాలిన్
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:46 PM
ఉదయం చల్లని వాతావరణం, పొగమంచు మధ్య స్టాలిన్ వాగింగ్ చేస్తూ పర్యాటకులు, స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. అక్కడి నక్షత్రం ఆకారంలోని సరస్సు చుట్టూ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు.
కొడైకెనాల్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) దిండిగల్ జిల్లా కొడైకెనాల్‌లో సేదతీరేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మంగళవారం ఉదయం చల్లని వాతావరణం, పొగమంచు మధ్య వాగింగ్ చేస్తూ పర్యాటకులు, స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. అక్కడి నక్షత్రం ఆకారంలోని సరస్సు (Lake) చుట్టూ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు.
కొడైకెనాల్‌లో ఉదయం వేళ సరస్సు చుట్టూ 11 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ టెంపరేషన్‌తో వాతావరణం అహ్లాదంగా ఉండటంతో వరుసగా మూడోరోజు కూడా స్టాలిన్ మార్నింగ్ వాక్ చేశారు. స్టాలిన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పలువురు స్టాలిన్‌తో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగారు. గత శనివారంనాడు ఆయన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పాంబార్‌పురం ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేశారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం స్వల్పకాలిక విశ్రాంతి కోసం దుబాయ్ వెళ్లారు. గత శుక్రవారంనాడు ఆయన కుటుంబసభ్యలతో కలిసి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్