Share News

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:47 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 100 శాతం వీవీప్యాట్ రీవెరిఫికేషన్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు
Madras HC Dismisses Stalin Petition

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓట్ల కౌంటింగ్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఎన్నికల్లో స్టాలిన్‌కు 74,202 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి టీవీకే పార్టీకి చెందిన వీఎస్ బాబు 82,997 ఓట్లతో విజయం సాధించారు. ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేసిన డీఎంకే అధినేత మే7 ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్ పరిశీలను దరఖాస్తు చేసుకున్నారు. జులై 29న జరిగిన పరిశీలన సందర్భంగా కొన్ని ఈవీఎంలు పనిచేయకపోవడాన్ని స్టాలిన్ గుర్తించారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలోని 100 శాతం వీవీప్యాట్‌లను మళ్లీ పరిశీలించాలని కోరారు.


ఎలక్షన్ కమిషన్ తరఫున సీనియర్ అడ్వకేట్స్ న్యాయవాదులు జీ రాజగోపాల్, దామా శేషాద్రినాయుడు హాజరయ్యారు. వారు తమ వాదనలు వినిపిస్తూ ఎన్నికల కౌంటింగ్‌పై అభ్యంతరాలను ఈసీఐకి పిటిషన్ ద్వారానే పరిష్కరించాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఈ పిటిషన్‌ను కొనసాగించే అవకాశం లేదని అన్నారు. ఈ కేసులో ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు మాజీ సీఎం స్టాలిన్ పిటిషన్‌ను కొట్టేసింది.


ఈ వార్తలనూ చదవండి:

అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి! షాకింగ్ వీడియో

యాసిన్ మాలిక్ సంచలన నిర్ణయం.. సరళా భట్ హత్య కేసులో కీలక ప్రకటన

Updated Date - Sep 03 , 2026 | 01:57 PM