అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి! షాకింగ్ వీడియో
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:29 AM
కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. గురువారం తెల్లవారుజామున మాస్కులు, హెల్మెట్లు ధరించిన దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి నానా రభసా సృష్టించారు. వస్తువులను చెల్లాచెదురుగా పడేసి, అద్దాలను పగలగొట్టారు. కొన్నింటి వస్తువులను తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిషేక్ బెనర్జీ షేర్ చేశారు. ఈ దాడి వెనుక బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ గవర్నర్, హోం మంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ పార్టీని, తనను చూసి సీఎం భయపడుతున్నారని అన్నారు. ‘రాష్ట్రంలోని ప్రతిపక్షం హింసాత్మ ఘటనలు, దాడులు, బెదిరింపులు గురవుతుంటే సీఎంకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేనట్టే అని తేల్చి చెప్పారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తాము ఎన్నటికీ మర్చిపోబోమని కూడా చెప్పారు.
ఈ దాడిపై టీఎంసీ ఐటీ సెల్ ఇంచార్జ్ ఉపాసన చౌదరి స్పందించారు. బీజేపీతో సంబంధంతో ఉన్న వారే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు నిందితులు కార్యాలయానికి వచ్చి అక్కడి సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారని అన్నారు. ఆ తరువాత బలవంతంగా లోపలకు ప్రవేశించి నానా రభసా సృష్టించారని అన్నారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఆ సమయంలో దూరంగా ఉండమని స్థానిక పోలీసులకు పైఅధికారుల నుంచి ఆదేశాలు అంది ఉంటాయని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
రాహుల్ పౌరసత్వ పిటిషన్ కొట్టివేత
యాపిల్ పండ్లకు నారింజలతో పోలికా?