Share News

మెటాలో మళ్లీ లేఆఫ్‌లు!

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:12 AM

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో లేఆ్‌ఫలకు సిద్ధమవుతోంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులలో 20ు లేదా అంతకంటే ఎక్కువ...

మెటాలో మళ్లీ లేఆఫ్‌లు!

  • నెల రోజుల్లో 16 వేల ఉద్యోగాలకు కోత

న్యూఢిల్లీ, మార్చి 14: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో లేఆ్‌ఫలకు సిద్ధమవుతోంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులలో 20ు లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించవచ్చని ‘రాయిటర్స్‌’ పేర్కొంది. మెటాలో ప్రస్తుతం 79వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 20ు అంటే..దాదాపు 15,800 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సీనియర్‌ లీడర్లతో పంచుకున్నట్టు సంస్థ వర్గాల నుంచి సమాచారం అందినట్టు రాయిటర్స్‌ పేర్కొంది. ఏ తేదీన కోతలు పెట్టాలి, నిర్దిష్టంగా ఎంతమందిని తొలగించాలన్నది ఇంకా నిర్ణయించలేదని వెల్లడించింది. నెల రోజుల్లో కోతలు అమలయ్యే అవకాశముందని పేర్కొంది. మెటా 2022 నవంబరులో దాదాపు 11 వేలమందిని తొలగించింది. 2023లో మరో 10 వేలమందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో కూడా రియాల్టీ ల్యాబ్స్‌ విభాగంలో 1500 మందిని తొలగించింది. కృత్రిమ మేధనే లేఆ్‌ఫలకు కారణం అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 07:12 AM