ఈ-20 పెట్రోల్‌తో 18 లక్షల కారు పనికిరాకుండా పోయింది!
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:53 AM
కొత్త కారులో ఈ 20 పెట్రోల్‌తో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ కారును వెనక్కి తీసుకొని మరో కొత్త కారును వినియోగదారుడికి అందించాలని ఛత్తీ్‌సగఢ్‌లోని వినియోగదారుల..
2 ఏళ్ల క్రితం కారు కొనుగోలు.. ఈ-20తో ఇంజిన్‌లో తీవ్ర సమస్యలు
కస్టమర్‌కు కొత్త కారైనా ఇవ్వండి.. లేదంటే 21.5 లక్షలు చెల్లించండి
‘మారుతి’కి ఛత్తీ్‌సగఢ్ ఫోరం ఆదేశం
అదనపు ఇథనాల్‌ను ఏం చేద్దాం?
ఏటా 1200 కోట్ల లీటర్లు చాలు
700 కోట్ల లీటర్లు మిగలనుంది
డిస్టిలరీస్ అసోసియేషన్ వెల్లడి
రాయ్‌పూర్, జూలై 16: కొత్త కారులో ఈ 20 పెట్రోల్‌తో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ కారును వెనక్కి తీసుకొని మరో కొత్త కారును వినియోగదారుడికి అందించాలని ఛత్తీ్‌సగఢ్‌లోని వినియోగదారుల కమిషన్ మారుతీ సుజుకీ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవ్తా అనే వైద్యుడు రాయ్‌పూర్‌లో ఓ మారుతీ డీలర్ వద్ద నుంచి రూ.18,29,000 వెచ్చించి 2024 జూన్‌లో గ్రాండ్ విటారా కారు కొనుగోలు చేశారు. కొన్ని నెలల్లోనే కారు ఇంజిన్‌లో సమస్యలు తలెత్తి నిలిచిపోతూ ఉండటంతో కంపెనీ సర్వీస్ సెంటర్‌కు పలుమార్లు తీసుకెళ్లారు. ఆ కారును 2024లో అమ్మినప్పటికీ.. దానిని తయారు చేసింది 2023 జనవరిలో అని తేలింది. ఈ మధ్య విస్తృతంగా వాడుకలోకి వచ్చిన ఈ 20 పెట్రోల్‌తో నడిచే సామర్థ్యం ఆ కారు ఇంజిన్‌కు లేదని వెల్లడైంది. దీంతో తనకు కొత్త కారు ఇప్పించాలని కోరుతూ ప్రేమ్‌రాజ్ వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కమిషన్.. సదరు కారును వెనక్కి తీసుకొని, ఈ 20 పెట్రోల్‌తో నడిచే కొత్త గ్రాండ్ విటారాను ప్రేమ్‌రాజ్‌కు 40 రోజుల్లో అందజేయాలని, లేనిపక్షంలో కారు ధర, ఇతర చార్జీలతో కలిపి ఆయనకు రూ.20,50,494 చెల్లించాలని ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక