Share News

సింగర్‌ను కొట్టి చంపిన డెలివరీ బాయ్స్..

ABN , Publish Date - Sep 08 , 2026 | 07:12 AM

54 ఏళ్ల మణిపురి సింగర్ దారుణ హత్యకు గురయ్యారు. డెలివరీ బాయ్స్, డాబా స్టాప్ సింగర్‌పై దాడి చేసి చంపేశారు. తన ఇంటి వద్ద మద్యం తాగొద్దని సింగర్ చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

సింగర్‌ను కొట్టి చంపిన డెలివరీ బాయ్స్..
Manipur singer

ఇంటర్‌నెట్ డెస్క్: 54 ఏళ్ల మణిపురి సింగర్ దారుణ హత్యకు గురయ్యారు. డెలివరీ బాయ్స్, డాబా స్టాప్ సింగర్‌పై దాడి చేసి చంపేశారు. తన ఇంటి వద్ద మద్యం తాగొద్దని సింగర్ చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మణిపూర్‌ కిలోకారి గ్రామానికి చెందిన సీ విక్రమ్ సింగ్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కిలోకారిలోని సొంత అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నారు.


సోమవారం తెల్లవారుజామున కొందరు డెలివరీ బాయ్స్, డాబా స్టాఫ్ విక్రమ్ సింగ్ ఇంటి బయట మందు పార్టీ చేసుకున్నారు. గట్టిగట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేయసాగారు. ఆ అరుపుల కారణంగా విక్రమ్ ఇంటి బయటకు వచ్చారు. తన ఇంటి దగ్గర మందు తాగవద్దని వారికి చెప్పాడు. దీంతో గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. వారందరూ విక్రమ్ మీద విచక్షణా రహితంగా దాడి చేశారు. కుటుంబసభ్యులు ఆయనను హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విక్రమ్ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను భరత్ కుమార్, ప్రమోద్, రంజాన్ ఖాన్, దీపాన్షు, మోహన్ విశ్వకర్మ, విజయ్, మన్ను‌గా గుర్తించారు. వీరే కాక ఓ మైనర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఏపీ భవన్‌లో రైస్‌ అవుట్‌లెట్‌

శనివారం వరకూ సభ

Updated Date - Sep 08 , 2026 | 11:13 AM