ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు వెళ్తా
ABN , Publish Date - May 07 , 2026 | 06:37 AM
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ యోచిస్తున్నారు....
రాజీనామా చేయను: మమత
కోల్‌కతా, మే 6: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ యోచిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ, ఈసీ అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించిన ఆమె తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోవాలని చెప్పినట్లు సమాచారం. కోల్‌కతాలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశంలో మమత ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయరాదన్న మమత నిర్ణయాన్ని టీఎంసీ నేతలు గట్టిగా సమర్థించారు. మరోవైపు రాజ్యాంగ నిపుణుల ప్రకారం గురువారం(మే 7)తో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో పాటు మమత పదవీకాలం కూడా ముగుస్తుంది. కాగా, పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కోల్‌కతాలోని మధ్యమ్‌గ్రామ్‌లో చంద్రనాథ్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు 4రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ