Share News

సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం.. మనసు మార్చుకున్న మమతా బెనర్జీ..

ABN , Publish Date - May 09 , 2026 | 01:22 PM

టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మనసు మార్చుకున్నారు. తన ఎక్స్ ఖాతాలో బయోను మార్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసనసభ) అని రాసుకున్నారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది.

సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం.. మనసు మార్చుకున్న మమతా బెనర్జీ..
Mamata Banerjee

కోల్‌కతా, మే 9: ‘నాపై గెలిచింది బీజేపీ కాదు, ఎన్నికల కమిషన్. నేను రాజీనామా చేయను’ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఈ రోజు(శనివారం) సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మమతా బెనర్జీ మనసు మార్చుకున్నారు. తన ఎక్స్ ఖాతాలో బయోను మార్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసనసభ) అని రాసుకున్నారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది.
mamata.jpg


కాగా, ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో గురువారం నాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్.ఎన్.రవి రద్దు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం రాష్ట్ర శాసనసభను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. 2026 మే 7 నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయని గవర్నర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి

టీవీకే విడుదల చేసిన వీడియోపై స్పందించిన దినకరన్

Updated Date - May 09 , 2026 | 01:28 PM